‘గుంటూరు కారం’ : మాస్ బీట్స్ తో అదరగొట్టిన కుర్చీ‘మడతపెట్టి’ పాట

‘గుంటూరు కారం’ : మాస్ బీట్స్ తో అదరగొట్టిన సాంగ్
Guntur Karam Song

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గుంటూరు కారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీపై నెట్టింట తెగ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ లోని ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు విడుదలైన ఈ పాట చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది . మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేష్, శ్రీలీల స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ ఎనర్జిటిక్ గా మాస్ స్టెప్పులతో రఫ్ఫాడించారు. ఇక ఈ ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్ ని ఇప్పుడు మీరు కూడా చుడండి .