మరిదితో అక్రమ సంబంధం….అడ్డ్డు వస్తున్నాడని కొడుకు తనతో అక్రమ సంబంధం అంటూ ప్రచారం !

Improper relationship with a sister is a brutal murder

తన మరిదితో వివాహేతర సంబంధాన్ని ఆపాలని ఎన్ని మార్లు కోరినా వినకుండా సొంత తల్లితో వివాహేతర సంబంధం కోసం యత్నిస్తున్నానంటూ సాక్షాత్తు కన్న తల్లే తనపై నిందలు మోపడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చిన్నాన్నతో తల్లి కలిసి ఉండటం చూసి రగిలిపోయాడు. వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు.

గొంతు కోసి తల్లిని హతమార్చాడు. కత్తిపోట్లకు గురైన అతడి చిన్నాన్న మాత్రం గ్రామస్తుల సాయంతో తప్పించుకున్నాడు. చిత్తూరు జిల్లా రెట్టగుంట దళితవాడకు చెందిన జ్యోతి(43)కి ఇదే గ్రామంలోని డేవిడ్‌రాజా(48) 25 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిరికి కుమార్తె సౌందర్య(24), ప్రేమ్‌కుమార్‌(22) సంతానం. పదేళ్ల క్రితం డేవిడ్‌ అనారోగ్యం బారిన పడి కొంత మతిస్థిమితం కోల్పోయాడు.

ఈ నేపథ్యంలో అవివాహితుడైన డేవిడ్‌ సోదరుడు సుందర్‌రాజ్‌తో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తన తల్లికి, చిన్నాన్నకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రేమ్‌కుమార్‌ తెలుసుకోవడంతో తల్లిని మందలించాడు. తీరు మార్చుకోవాలని హితవు పలికాడు. అయినా ఆమె తన కొడుకే తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని పిలుస్తున్నాడంటూ ఇరుగు పొరుగు వారికి చెప్పసాగింది.

ఇది  ప్రేమ్‌కుమార్‌ చెవిన పడడంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు. మొన్న రాత్రి మద్యం సేవించి ఇంటిలో తన తల్లి జ్యోతితో గొడవకు దిగాడు. తనపైనే దారుణమైన నిందలు మోపుతావా? అని ఆమె నిలదీశాడు. దీంతో ఆమె రాత్రి 11.30 గంటలకు గుడిపాల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు తన కుమారుడు మద్యం తాగి కొట్టడానికి వస్తున్నాడని చెప్పింది.

పోలీసులు ఆ సమయంలో వారింటికి వెళ్లి ప్రేమ్‌కుమార్‌కు నచ్చజెప్పారు. పోలీసులు వెళ్లిన వెంటనే ఇంటిలో ఉన్న బట్టలను సర్దుకుని ప్రేమ్‌కుమార్‌ ఇంటి నుంచి బయటకి వచ్చేశాడు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన చిన్నాన్న  సుందర్‌రాజ్, తల్లి జ్యోతి ఇద్దరూ కలిసి ఉండటం చూసి ఆవేశంతో రగిలిపోయాడు.

వారిపై కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి తల్లిని హతమార్చాడు. ప్రేమ్‌కుమార్‌ దాడిలో కత్తిపోట్లకు గురైన సుందర్‌రాజ్‌ చావు కేకలు పెట్టాడు. అతడి అరుపులకు చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో అతను తప్పించుకున్నాడు. తల్లిని కడతేర్చిన ప్రేమ్‌కుమార్‌ గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.