ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ : సలార్ ట్రైలర్ వచ్చేసింది ..!

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ : సలార్ ట్రైలర్ వచ్చేసింది ..!
Cinema News

ఇండియాలో ఉన్న కోట్లాదిమంది ప్రభాస్ అభిమానులు అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు సమయం రానే వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ ల కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా “సలార్” కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అభిమానులకు పూనకాలు తెస్తుందని చెప్పాలి. కాసేపటి క్రితమే సినిమా యూనిట్ సలార్ ట్రైలర్ ను విడుదల చేసింది.. ఈ ట్రైలర్ ని మేకర్స్ 3 నిముషాల 46 సెకనుల నిడివితో కట్ చేసి ఎంతగానో ఆకట్టుకున్నారు అని చెప్పాలి. ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఇక సినిమా ఏ విధంగా ఉందేమోనన్న ఉత్సుకత పెరిగిపోతోంది. ఈ ట్రైలర్ లో మేకర్స్ ముఖ్యంగా ప్రభాస్ లుక్, యాక్షన్ సెక్వెన్సు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లపై ఫోకస్ చేసి విడుదల చేశారు.

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ : సలార్ ట్రైలర్ వచ్చేసింది ..!
Prabhas ” Salaar ” Trailer

ఇందులో ప్రభాస్ తో పాటుగా పృథివీ రాజ్ సుకుమారం, జగపతి బాబు మరియు శృతిహాసన్ లాంటి నటులు ఉండడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ని డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థీయేటర్ లలో విడుదల చేస్తున్నారు.

ట్రైలర్ ని మీరు కూడా ఒక లుక్ వేయండి :

Video : https://youtu.be/4GPvYMKtrtI