వైరల్ అవుతున్న ‘హనుమాన్’ వీడియో సాంగ్

వైరల్ అవుతున్న ‘హనుమాన్’ వీడియో సాంగ్
Cinema News

హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఐతే, తాజాగా ‘హనుమాన్ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్ విడుదలైంది. ‘పూలమ్మే పిల్ల’ అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ ఇంట్రడక్షన్ చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది. అన్నట్టు కాసర్ల శ్యామ్ ఈ పాటని రాశారు. అలాగే, గౌర హరి ఈ పాటని పాట ని పాడడం తో మ్యూజిక్ ను కూడా అందించారు.

వైరల్ అవుతున్న ‘హనుమాన్’ వీడియో సాంగ్
Hanuman Movie

కాగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.270 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఏది ఏమైనా చిన్న మూవీ గా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ లో ‘హనుమాన్’ మూవీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి అటు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ రెస్పాన్స్ దక్కింది. అలాగే, హనుమాన్ మూవీ ప్రేక్షకులనే కాదు, మూవీ వాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే, ప‌లువ‌రు సినీ సెల‌బ్రిటీలు కూడా హనుమాన్ మూవీ ను ప్ర‌శంసిస్తున్నారు.