మగాడంటే ఇలా ఉండాలి…

Theology says how to Behave Man with womens

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు… పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది… కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు.

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
(కామందక నీతిశాస్త్రం)

కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.

కరణేషు దక్షః:
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

రూపేచ కృష్ణః:
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. (అంటే ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.

క్షమయా తు రామః:
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

భోజ్యేషు తృప్తః:
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

సుఖదుఃఖ మిత్రం:
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

నిజమే కదా….