ఆ ముగ్గురు నా ఫేవరెట్

ఆ ముగ్గురు నా ఫేవరెట్

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అందరి అగ్ర హీరోలను చక్కబెట్టేసిన హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ కంటే ముందే పూజా హెగ్డే పేరుని పెట్టొచ్చు.తన కెరీర్ ఆరంభంలోనే తెలుగు సహా తమిళ్ లో హిట్లు పడకపోయినా టాలీవుడ్ లో మాత్రం ఇప్పుడు తాను టాప్ మోస్ట్ హీరోయిన్.మహేష్ బాబు తారక్,బన్నీ లేటెస్ట్ గా ప్రభాస్ లాంటి అగ్ర హీరోలతో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

అయితే ఇప్పటి వరకు అని కాదు కానీ మొత్తం తాను చేసిన హీరోల్లో తనకు నచ్చిన కో స్టార్స్ ఎవరు అంటే టాలీవుడ్ నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు డార్లింగ్ హీరో ప్రభాస్ పేర్లను ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ ముగ్గురికే చేసింది.అయితే టాలీవుడ్ లో బన్నీతో ఇది వరకే ఒక చిత్రంలో కనిపించింది.

ఇప్పుడు రెండో చిత్రం “అల వైకుంఠపురములో”నటిస్తుంది.కానీ ప్రభాస్ తో ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క చిత్రంలో నటిస్తుంది.ఇంతలోనే ప్రభాస్ ను తన ఫేవెరెట్ కో స్టార్స్ లో ఒకరిగా చెప్పేసింది.అంటే ఓ సినిమా పూర్తికాక మునుపే డార్లింగ్ పూజకు స్పెషల్ గా మారిపోయాడని చెప్పాలి.ప్రస్తుతం ఈ ఇద్దరి కలయికలో రాధాకృష్ణ దర్శకత్వంలో “జాన్” చిత్రం షూటింగ్ జరుగుతుంది.