రకుల్‌ భర్తకు అందం లేకున్నా అది ఉండాలట!

tollywood actressrakul-preet-singh-feelings-about-her-husband

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు అప్పుడే పెళ్లిపై గాలి మరలినట్లుగా అనిపిస్తుంది. గత కొన్నాళ్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె తన పెళ్లి గురించి ఏదో ఒక కామెంట్‌ చేయడం, అది కాస్త మీడియాలో వైరల్‌ అవ్వడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఖచ్చితంగా తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అంటూ ప్రకటించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆ విషయంలో చాలా ప్రచారం జరిగింది. ఆ చర్చ ముగియక ముందే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరో ఆసక్తికర వ్యాఖ్య చేసి, అందరి దృష్టిని ఆకర్షించింది. 

తనకు కాబోయే వాడు పెద్ద అందగాడు అవ్వాల్సిన అవసరం లేదని, కాకుంటే హైట్‌ బాగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆర్మీ ఆఫీసర్‌గా దృడంగా ఉండాని, ఆర్మీకి సరిపోయే హైట్‌ ఉన్న వాడు అయితే తనకు ఓకే అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది. అందంగా లేకపోయినా హైట్‌ ఉండాలంటూ తనకు కాబోయే భర్త క్వాలిటీస్‌ చెబుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చూస్తుంటే మరో రెండు మూడు సంవత్సరాల్లో పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుంది. ఈమె నటించిన ‘స్పైడర్‌’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

మరిన్ని వార్తలు:

లవ, కుశలు సిద్దం అవుతున్నారు