యువ హీరోలనే కావాలంటున్న హీరోయిన్స్‌

tollywood star heroines rejected telugu star heroes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఇటీవల కండీషన్స్‌ పెడుతున్నారు. సక్సెస్‌ ఉన్న హీరోలతో నటించాలని ఎక్కువ కోరుకుంటున్నారు. ఒక హీరోకు వరుసగా రెండు మూడు ఫ్లాప్‌లు వస్తే ఆ హీరోతో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్స్‌ ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్‌ సీనియర్‌ స్టార్‌ హీరోలతో నటించేందుకు పోటీ పడేవారు. కాని ఇప్పుడు స్టార్‌ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలయ్య వంటి వారితో నటించేందుకు నో అంటున్నారు. ప్రస్తుతం చరణ్‌, అల్లు అర్జున్‌, నాని, ప్రభాస్‌ వంటి యంగ్‌ హీరోలతో మాత్రమే నటించేందుకు హీరోయిన్స్‌ ఆసక్తిని కనబర్చుతున్నారు.

సినిమా దర్శకుడు ఎవరు, కథ ఏంటీ, పాత్ర ఎలా ఉంది అనే విషయాలను హీరోయిన్స్‌ పట్టించుకోకుండా యువ హీరో అయితేనే నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నయనతార మినహా ఏ హీరోయిన్‌ కూడా సీనియర్‌ హీరోలతో నటించేందుకు ఆసక్తిని కనబర్చడం లేదు. ఇటీవల సునీల్‌తో ‘2 కంట్రీస్‌’ చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం కోసం హీరోయిన్‌ ఎంపిక విషయంలో దర్శకుడు శంకర్‌ చాలా చిరాకు పడ్డాడట. పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ను సంప్రదించగా సునీల్‌తో నటించలేం అంటూ ఆయన మొహంపైనే చెప్పేశారట. మంచి పాత్ర, మంచి కథ అంటూ చెప్పే ప్రయత్నం చేసినా కూడా అంతగా ఆసక్తి చూపలేదని శంకర్‌ అన్నాడు.

కథ వినకుండానే సునీల్‌తో నటించలేం అంటూ చెప్పారని శంకర్‌ పేర్కొన్నాడు. ఇలా ఎంతో మంది హీరోలకు హీరోయిన్స్‌ సమస్య తలెత్తుతుంది. స్టార్‌ హీరోయిన్స్‌ అవకాశాలు లేకుంటే ఖాళీగా అయినా ఉంటున్నారు, కాని సక్సెస్‌ లేని హీరోలతో మాత్రం సహవాసం చేయడం లేదు. ‘జైసింహా’ చిత్రం కోసం పలువురు హీరోయిన్స్‌ను సంప్రదించగా బాలయ్యతో నటించేందుకు ఆసక్తిని కనబర్చలేదు. దాంతో నటాషా, హరిప్రియ అనే ఇద్దరు గుర్తింపు లేని హీరోయిన్స్‌ను ఎంపిక చేశారు.