మతిమరుపు, అతి శుభ్రం.. ఇప్పుడు స్వార్థపరుడు

naga chaitanya role in sailaja reddy alludu revealed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల మారుతి చేస్తున్న చిత్రాలు యూత్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతున్నాయి. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ చిత్రాలు ఏ రేంజ్‌లో సక్సెస్‌ను దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నాగచైతన్య కోసం ఒక కథను సిద్దం చేస్తున్నాడు. ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌తో నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడినది. ప్రస్తుతం చైతూ ‘సవ్యసాచి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాకుండానే మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడు. వచ్చే సంవత్సరం ఆరంభంలోనే షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాబోతుంది.

nagachaitanya-role-relealed

ఇక మారుతి ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంలో నానిని మతిమరుపుతో చూపించాడు, ‘మహానుభావుడు’ చిత్రంలో అతి శుభ్రత వ్యక్తిగా శర్వాను చూపించాడు. ఇప్పుడు ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో నాగచైతన్యను ఒక స్వార్థ పరుడిగా మారుతి చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. హీరో అంటే అన్ని మంచి గుణాలు ఉండాలి అనే సెంటిమెంట్‌ను దర్శకుడు మారుతి చెరిపేస్తున్నాడు.

nagachaitany-new-movie-role

ఇప్పటికే నాగచైతన్య 100%లవ్‌ చిత్రంలో కాస్త నెగటివ్‌ ఛాయలు ఉన్న వ్యక్తిగా నటించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రను స్వార్థపరుడిగా చేయబోతున్నాడు. వచ్చే సంవత్సరం వేసవి చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు మారుతి ఉన్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకుడు మారుతి చెబుతున్నాడు. అతి త్వరలోనే సినిమా హీరోయిన్‌ విషయమై ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నారు. చైతూ అత్తగా ఒక సీనియర్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసే విషయమై మారుతి ప్లాన్‌ చేస్తున్నాడు.