శైలజారెడ్డి కూతురుకు ముద్దు పెట్టాడా…?

Kiss Scenes At Sailaja Reddy Alludu Movie

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 13న వినాయక చవితి సందర్బంగా భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక పూర్తి అయ్యాయి. ఈ చిత్రంకు సెన్సార్‌ కూడా పూర్తి చేయించారు. యూ/ఎ సర్టిఫికెట్‌ను సెన్సార్‌ బోర్డు ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో ముద్దు సీన్‌ ఉన్నట్లుగా సెన్సార్‌ వర్గల నుండి సమాచారం అందుతుంది. ముద్దు సీన్‌తో పాటు కొన్ని హీరోయిన్‌ గ్లామర్‌ సీన్స్‌ ఉన్న కారణంగానే ఈ చిత్రంకు యూ/ఎ ఇచ్చినట్లుగా వారు చెబుతున్నారు.

sailajareddy-nagchaitanya

ఈమద్య చిన్న చిత్రాలు ఎక్కువగా ముద్దు సీన్స్‌పై ఆధారపడి తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరుగుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. మారుతి గత చిత్రాల్లో ముద్దు సీన్స్‌ లేవు. కాని ప్రస్తుతం ముద్దు సీన్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న కారణంగా నాగచైతన్యను ఒప్పించి మారుతి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కథలో భాగంగా ముద్దు సీన్‌ వచ్చేలా దర్శకుడు ప్లాన్‌ చేశాడు. మరీ వల్గర్‌గా కాకుండా రొమాంటిక్‌ ముద్దు సీన్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రమ్యకృష్ణ అత్త పాత్ర పోషించడంతో పాటు పొగరుబోతు కూతురు పాత్రలో అను ఎమాన్యూల్‌ చక్కగా సూట్‌ అయ్యింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమా కూడా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

sailajareddy-alludu-movie