చైతూకు సామ్‌ పెళ్లి రోజు కానుక…!

Samantha Has A Unique Gift For Hubby Naga Chaitanya On First Wedding Anniversary ,

అక్కినేని నాగచైతన్య మరియు సమంతలు గత సంవత్సరం అక్టోబర్‌లో ఒక్కటైన విషయం తెల్సిందే. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న వీరిద్దరు వరుసగా చిత్రాలు చేస్తూ ఉన్నారు. తాజాగా వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీరిద్దరు విడి విడిగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ మరియు ‘యూటర్న్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక వీరిద్దరి కలయికలో ఒక చిత్రం రాబోతుంది.

samnatha-nag-chaitanya
తాజాగా ‘యూటర్న్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే నెలలో తమ మొదటి మ్యారేజ్‌ డే రాబోతుంది. ఆమ్యారేజ్‌ డేకు చైతూకు ప్రత్యేకమైన బహుమానం ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. వచ్చే నెలలో 6వ తారీకున తమ ఇద్దరి కాంబినేషన్‌లోని సినిమా ప్రారంభం కాబోతుంది. ఆ సినిమానే చైతూకు తాను ఇచ్చే గిఫ్ట్‌ అంటూ సమంత పేర్కొంది. శివ నిర్వాన దర్శకత్వంలో కోన వెంకట్‌ నిర్మించబోతున్న ఆ చిత్రంలో భార్య భర్తలుగా సమంత, నాగచైతన్యలు కనిపించబోతున్నారు. వరుసగా వీరు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

samantha-nag-chaitanya-movi