మరో షాక్ ఇచ్చిన శివాజీ…జగన్ ప్లాన్ లీక్…!

cm-chandrarbabu-naidu

దాదాపు ఎనిమిదేళ్ళ నాటి బాబ్లీ ఘటనకు సంబంధించి చంద్రబాబుకు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఏపీలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. దేశ రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశమే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ గరుడ’ను తెరపైకి తెచ్చిన సినీ నటుడు శివాజీ మరో సంచలనానికి తెరలేపారు. చంద్రబాబుకు త్వరలో మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు.

cm-chandrababu-naidu
ఒక మనిషిని నిర్వీర్యం చేయడానికి, ఒక కుర్చీని ఆక్రమించుకోవడానికి ఇంత కుట్ర పూరిత రాజకీయాలు అవసరమా? అంటూ ఆయన మండిపడ్డారు. మనుషుల్ని తొక్కేసి ప్రభుత్వాలను కూల్చేద్దాం అనే విధంగా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. సమాజంలో స్వేచ్ఛను కోల్పోయే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు వచ్చిన నోటీసులు దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ ట్రాప్ లో చంద్రబాబు పడరాదని, ఈ ట్రాప్ లో ఆయన పడితే కచ్చితంగా మరో రెండు, మూడు నోటీసులు ఇస్తారని హెచ్చరించారు.

cm-sivaji
శివాజీ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తనపై కామెంట్స్ చేశారని, జగన్‌కు ఏమన్నా పని ఉందా అని శివాజీ మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా అని ప్రశ్నించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదో విధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని అందరూ కలిసి చూస్తున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబుపై కేసులు పెడతారు.. ఆయన లోపలకు వెళ్తారు… టీడీపీ ఎమ్మెల్యేలు చీలిపోతారు… ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వస్తుంది… అనంతరం ఎన్నికలు వస్తాయి’ ఇదేనా మీ ఉద్దేశమని ప్రశ్నించారు. అసలైన కుట్ర ఇదేనని… ఏదో ఒక విధంగా చంద్రబాబును కూలదోసి, అధికారంలోకి రావాలనేదే కుట్ర అని శివాజీ జగన్ ప్లాన్ గా చెప్పబడుతున్న దానిని బహిర్గతం చేసారు.

cm-and-sivaji
దేశంలో మోదీకి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని శివాజీ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం చంద్రబాబుకు దక్కడం తెలుగుజాతికి గౌరవమని శివాజీ అభిప్రాయపడ్డారు. తాను గత మూడు రోజుల నుంచి లాయర్లతో మాట్లాడానని, ఈ నోటీసులకు సంబంధించిన పరిణామాల గురించి తెలుసుకున్నానని శివాజీ చెప్పారు. మరికొన్ని నోటీసులు కూడా మీ కోసం సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఆ నోటీసుల గురించి తాను బయటకు చెప్పలేనని… ఏపీలో తనకు భద్రత ఉందని, కానీ తన సామ్రాజ్యం మరో చోట ఉందని, నోటీసుల గురించి తాను మాట్లాడితే, తనకు అక్కడ భద్రత ఉండదని చెప్పారు.