పవన్‌ మెచ్చిన స్క్రిప్ట్‌ వెంకీ వద్దకు…!

Trivikram New Movie On Venkey

పవన్‌ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్‌ పలు కథలను రాయడం జరిగింది. కాని అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్‌ కళ్యాణ్‌ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయిన విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుండటంతో పాటు, భవిష్యత్తులో కూడా ఆయన సినిమాలు నటిస్తాడనే నమ్మకం లేదు అంటూ సినీ వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో గతంలో పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఒక కథతో వెంకీ హీరోగా త్రివిక్రమ్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి.

pawan-venkey-movies

ప్రస్తుతం ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్‌ త్వరలోనే వెంకీతో సినిమాను చేస్తాడని తెలుస్తోంది. గతంలో పవన్‌తో ఈ కథను చేయాలని భావించాడు. అయితే అజ్ఞాతవాసి చిత్రం తర్వాత చేద్దామని పవన్‌ సూచించడంతో మొదట అజ్ఞాతవాసి చిత్రంను చేయడం జరిగింది. ఆ కథపై చాలా నమ్మకంగా ఉన్న త్రివిక్రమ్‌ ఖచ్చితంగా మంచి విజయాన్ని వెంకీకి ఇస్తుందని అంటున్నాడు. వెంకీ కూడా స్టోరీ లైన్‌కు ఫిదా అయ్యి వెంటనే డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం వెంకీ రెండు మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ రెండు చిత్రాల తర్వాత అంటే వచ్చే వేసవిలో త్రివిక్రమ్‌తో మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

trivikram