‘సవ్యసాచి’పై సుక్కు కామెంట్స్‌…!

Director Sukumar Shocking Comments On Savyasachi Movie

వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ చిత్రాన్ని రూపొదించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలయి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఈ ట్రైలర్‌పై పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ తాజాగా ట్రైలర్‌పై స్పందించాడు. ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఇంతవరకు రాని విభిన్నమైన కథతో చందూ ఈ చిత్రాన్ని రూపొందించాడు. గతంలో చందూ తెరకెక్కించిన ‘కార్తీకేయ’ చిత్రానికి నేను అభిమానిని. ట్రైలర్‌ చూసి నేను షాకయ్యాను, ఇండియా స్క్రీన్‌ మీద ఇలాంటి కాన్సెప్ట్‌తోనే సినిమా రాలేదు అంటూ సుక్కు చెప్పుకొచ్చాడు.

Savyasachi

ఇంతమంచి సినిమాను నేను తీయనందుకు అసూయ పడుతున్నాను, ఈ చిత్రంలో హీరోగా నటించిన చైతూ మంచి నటుడు, అతనితో నాకు రెగ్యులర్‌ సంబంధం ఉంది, మేమిద్దరం గతంలో ఒక సినిమా కూడా చేశాం. సంగీత దర్శకుడు కీరవాణి ట్రైలర్‌లో సూపర్‌గా రీరికార్డింగ్‌ చేశారు. కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సుక్కు ‘సవ్యసాచి’ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. చందూ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు, ఇది చాలా అద్భతంగా ఉండబోతుంది అని ధీమా వ్యక్తం చేశారు.

Director-Sukumar