‘శైలజారెడ్డి అల్లుడు’ ఫలితం చైతూ మాటల్లో…!

Surprise Gift for Naga Chaitanya

అక్కినేని నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా మెప్పించలేకపోయాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రావడంతో నష్టాలే మిగిలినట్టు సినీ వర్గాల నుండి సమాచారం వెల్లడైంది. కాగా తాజాగా చైతూ ‘సవ్యసాచి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన చైతూకు ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫలితం గురించి మీ స్పందన ఏమిటని ప్రశ్న ఎదురైంది. కాగా చైతూ నవ్వుతూ… ఆ ఫలితం నాకు సంతోషంగానే ఉంది, నా కెరియర్‌లో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. కాబట్టి నాకు ఆ చిత్రంపై ఎలాంటి నిరాశ లేదు కానీ అది ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం బాద అనిపించింది తప్పితే నష్టాల మిషయంలో పెద్దగా సమస్య ఏమి లేదని చాలా సున్నితంగా సెలవిచ్చాడు.

Distributors Heavy Losses In Sailaja Reddy Alludu Movie

చైతూ రీషూట్లపై కూడా స్పందించి, రీషూట్‌ చేస్తే తప్పేముంది, సినిమా పూర్తయ్యాక ఏదైనా తేడా అనిపిస్తే దాన్ని కవర్‌ చేయడానికి రీషూట్‌ చేస్తాం అందులో నెగెటివిటీ ఎందుకు? రిలీజ్‌ అయ్యాక అరే మిస్టేక్‌ అని అనుకునే కంటే ముందు చూసి లోటుపాట్లను సవరిస్తే మంచిదే కదా, సీన్‌ ఇంకా బాగా వస్తుంది అంటూ రీషూట్‌లను సమర్థించాడు. ఇక చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని, మంచి కథతో ఈ సారి మీ ముందుకు వచ్చాను అంటూ చైతూ చెబుతున్నాడు. ఎన్ని మాటలు చెప్పినా కూడా కాసేపట్లో ఫలితం ఎలా ఉంటుందో అందరికి తెలియబోతుంది. ఈ చిత్రంతో అయినా మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చైతూ చాలా గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ చిత్రంలో మాధవన్‌ విలన్‌ పాత్రలో నటించగా, భూమిక చైతూ అక్కగా కనిపించనుంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది.

savyasachi-movie