సుకుమార్ తో సినిమా వదులుకోడానికి కారణం….రెమ్యునరేషనా ?

Mahesh Babu To Get 50 Crosse Remuneration

సుకుమార్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా క్యాన్సిల్ చేసుకోవడం ఇప్పుడు మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే టాపిక్ గురించి చర్చలు జరుపుతున్నారు. అయితే దేనికి మరో కారణం ఉందని చెబుతున్నారు. సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ చేసుకొని మహేష్ అనిల్ రావిపూడి తో సినిమా చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇలాంటి నేపధ్యం లో మహేష్ బాబు ఒక బంపర్ చాన్స్ కొట్టేశాడు. మహేష్ సుక్కు ప్రాజెక్టును విడిచిపెట్టి అనిల్‌ సినిమాకు ఓకే చెప్పడానికి దీనికి ఆఫర్ చేసిన భారీ పారితోషకం ఓ కారణమని అంటున్నారు.

ఈ సినిమా కోసం మహేష్ కి ఏకంగా 50 కోట్లు డీల్ సెట్ చేసినట్లు తెలుస్తుంది. అనిల్ రావిపూడి మహేష్ కాంబో సినిమా 50 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ సినిమాని 3 నెలల్లో పూర్తి చెయ్యాలని ప్రణాళికలు వేసుకున్నారట, ఒక సినిమా చెయ్యడానికి మహా అయితే ఖర్చు ఒక 25 కోట్ల వరకు అవుతుంది. అందులోను మహేష్ సినిమా అంటే అది దాదాపు 100 కోట్ల బిజినెస్ ఉంటుంది అలాంటప్పుడు మహేష్ బాబు కి ఇలా 50 కోట్లు ఆఫర్ చెయ్యడం సబబే.