భైరవ గీత – భగవద్గీత సాంగ్ టీజర్

Bhagavad Geetha Song Teaser in Bhairava Geetha Movie

అర్జున్ రెడ్డి త‌ర్వాత అడ‌ల్ట్ మూవీగా తెర‌కెక్కి భారీ విజ‌యం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ రెండు సినిమాలను ఇన్స్పైరింగ్ గా తీసుకుంటున్న వర్ధమాన దర్శకులు ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. తాజాగా వ‌ర్మ స‌మ‌ర్పిస్తున్న భైర‌వ‌గీత అనే చిత్రం కూడా అదే రేంజ్‌లో ఉంటుంద‌ని తాజాగా విడుద‌లైన ట్రైలర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. ధనంజ‌య‌, ఇర్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్ధ తాతోలు తెర‌కెక్కించాడు. ఈ మూవీతో ఆయ‌న దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. వర్మ దగ్గర శిష్యరికం చేసిన ఆయన అభిషేక్ పిక్చర్స్ సంస్థ భాగస్వామ్యంతో చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. తాజాగా భ‌గ‌వ‌ద్గీత అనే ప్రోమో వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. వర్మ స్కూల్ నుండి వచ్చిన సిరా శ్రీ రాసిన ఈ పాట‌ని విజ‌య్ యేసుదాస్‌, సాక్షి హోల్క‌ర్ ఆల‌పించారు. మీరు ఆ సాంగ్ చూసెయ్యండి మరి.