‘ఆర్‌ఎక్స్‌100’ దారిలోనే భైరవగీత?

కార్తికేయ, పాయల్‌ జంటగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం ఏకంగా 20 కోట్ల షేర్‌ను దక్కించుకుని రికార్డులు సృష్టించింది. ఆ చిత్రం అంతగా విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణం బోల్డ్‌ కంటెంట్‌ మరియు ముద్దు సీన్స్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలో ముద్దు సీన్స్‌ లేకుంటే ఖచ్చితంగా సినిమా ఆడేది కాదు. కాని భారీ స్థాయిలో ముద్దు సీన్‌ ఉండటంతో మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మాణంలో ‘భైరవగీత’ చిత్రం రాబోతుంది.ramgopal varma next film bhairava geethaతెలుగు మరియు కన్నడంలో రూపొందిన ‘భైరవగీత’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా వర్మ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్‌లుక్‌లోనే లిప్‌లాస్‌ స్టిల్‌ను విడుదల చేయడంతో సినిమా ఖచ్చితంగా బి గ్రేడ్‌ కంటెంట్‌ కుప్పలు తెప్పలుగా ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంకు వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్రానికి కూడా వర్మ మరో శిష్యుడు సిద్దార్థ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రంను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తెలుగులో ఈ చిత్రంను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ వారు డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నారు. చిన్న చిత్రంగా విడుదలై ఈ చిత్రం కూడా పెద్ద విజయాన్ని దక్కించుకుంటుందని సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.