శ్రియ రహస్యంగా వచ్చి వెళ్లింది

sriya sharan

తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రియ. తెలుగులో ఈమద్య ఈమెకు పెద్దగా ఛాన్స్‌లు రావడం లేదు. వచ్చినా కూడా అడపా దడపా సక్సెస్‌లు మాత్రమే దక్కుతున్నాయి. దాంతో మెల్ల మెల్లగా సినిమాలకు దూరం అయ్యి వైవాహిక జీవితంకు సిద్దం అవుతుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నా కూడా ఈమెకు మాత్రం పెద్దగా అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపించం లేదు. తాజాగా ఈమె తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమలకు ఎంతో మంది వస్తూ ఉంటారు. కాని తిరుమలకు వచ్చిన శ్రియ మీడియా కంట పడకుండా జాగ్రత్త పడటం చర్చనీయాంశం అవుతుంది. shriya saran in tirumalaశ్రియ దైవ దర్శనం అనంతరం బయటకు వచ్చిన సందర్బంలో పూర్తిగా తన ఫేస్‌ను పసుపు కలర్‌ చున్నీతో కవర్‌ చేసుకుంది. కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఆమె చున్ని కప్పుకుంది. అయినా కూడా అక్కడి మీడియా వారు ఆమెను గుర్తుపట్టి, మాట్లాడివ్వాలని ప్రయత్నించారు. కాని ఆమె మాత్రం ముహంపై చున్నీ తియ్యకుండానే అక్కడ నుండి కారులో వెళ్లి కూర్చుంది. శ్రియ ఎందుకు ఇలా రహస్యంగా వచ్చి వెళ్లిందా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో శ్రియ తిరుమలకు వచ్చిన సమయంలో ఒక ఆకతాయి ఆమెను లైంగికంగా వేదించాడు. దాంతో ఆమె ఇలా రహస్యంగా వచ్చి దైవదర్శనం చేసుకుని, మీడియాకు కనిపించకుండా వెళ్లినట్లుగా అక్కడి వారు అనుకుంటున్నారు.