ఏపీ కోసం మరో ప్రాణం బలి…!

Doddi Trinadh Died For Ap Special Status

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధన కోసం మరో ప్రాణం బలయ్యింది. ప్రత్యేక హోదా రావట్లేదని కలత చెందిన ఒక యువకుడు ప్రాణ త్యాగానికి పాల్పడ్డాడు. రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) అనే యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు అర్పించాడు.

man-died

సదరు యువకుడు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌ గేట్‌ వద్ద సెల్ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌ లో రాశాడు. ఆయన ఈ సూసైడ్ నోట్ ఏపీ సీఎం చంద్రబాబుని ఉద్దేశించి వ్రాసాడు. సంఘటన స్థలంలో దొరికిన ఈ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

man-ap-status-died