ప్రత్యేక హోదా కోసం టెన్త్ విద్యార్ధి ఆత్మహత్య…!

Tenth Student Suicide For Special Status

ప్రత్యేక హోదా కోసం మరో ప్రాణం బలయ్యింది. ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంకు చెందిన పదో తరగతి చదువుతున్న మహేంద్ర అన్నకు ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రత్యేకహోదా కోసమే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు.

status

ప్రత్యేక హోదా వచ్చుంటే, తన అన్నకు ఉద్యోగం వచ్చుండేదని తన సూసైడ్ లేఖలో వివరించాడు. హోదా రాకపోవడం వల్లే తన అన్న నిరుద్యోగిగా ఉన్నాడని, దీంతో కుటుంబం గడవటం కష్టమైందని మహేంద్ర ఆ లేఖలో తెలిపాడు. అందుకే కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకున్నానని తన ఆవేదనను సూసైడ్ నోట్ లో వ్రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మహేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

ap-status