ఆపరేషన్ గరుడలో ఐవైఆర్ కృష్ణారావు ఓ కీలక పాత్ర అని ఇప్పుడు ఐవైఆర్ తన ముసుగు తొలగించాడని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ శిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. తాజాగా ఐవైయార్ బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఐవైఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.
బీజేపీ-వైసీపీ బంధం బలపర్చేందుకు ఐవైఆర్ కృషి చేస్తున్నారని, కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై తప్పుడు నివేదికలు అందిస్తున్నాడన్నారు. అలాగే ఆయన స్వార్దం కోసం బ్రాహ్మణ సమాజాన్ని తాకట్టు పెట్టవద్దని తిరుమల వేంకటేశ్వరుడిని ఆపరేషన్ గరుడ రాజకీయానికి వాడుతూ ఐవైఆర్ చాలా పెద్ద పాపం చేస్తున్నాడని శ్రీధర్ పేర్కొన్నారు.