ఎన్టీఆర్‌పై ఎటాక్‌ చేస్తున్న వర్మ…!

Bhairava Geetha Movie Release On Oct 12th

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈమద్య కాలంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఇటీవలే నాగార్జునతో మరో శివ అంటూ తెరకెక్కించిన ‘ఆఫీసర్‌’ కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో వర్మ దర్శకత్వంపై కాస్త వెనకడుగు వేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన దృష్టి నిర్మాణంపై పడ్డట్లుగా తెలుస్తోంది. చిన్న బడ్జెట్‌ చిత్రాలను వరుసగా తన కంపెనీ నుండి నిర్మించాలని వర్మ నిర్ణయించుకున్నాడు.

bhirava-geetha

అందులో భాగంగానే తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ద్వి భాష చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ దక్కింది. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం తరహాలోనే ఈ చిత్రం కూడా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. అందుకే సినిమాపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ramgopa-bhitavageetha
రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తన ‘భైరవగీత’ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు. భారీ చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం విడుదల కాబోతున్న రోజే తన శిష్యుడు తెరకెక్కిస్తున్న ‘భైరవగీత’ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దసరా సందర్బంగా భారీ అంచనాల నడుమ సోలోగా రావాలనుకున్న అరవింద సమేత చిత్రానికి వర్మ ఇలా అడ్డు తలగడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు భైరవ గీత చిత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు. కాని రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వడం వల్ల థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు అంతో ఇంతో కలెక్షన్స్‌పై కూడా ప్రభావం పబోతుంది. పైగా అభిషేక్‌ పిక్చర్స్‌ వారు అరవింద సమేత చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో భారీ గానే వారు రిలీజ్‌ ప్లాన్‌ చేస్తారు. అలా జరిగితే అరవింద సమేతకు అనుకున్న స్థాయిలో థియేటర్లు లభించడం కష్టం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ కాస్త టెన్షన్‌ పడుతున్నారు.

ram-gopal-varma-aravandha-s