మా వివాదం.. మహేష్‌ వెనకడుగు…!

Naresh Comments On Mahesh Babu

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ నిధుల గోల్‌మాల్‌ విషయంలో అధ్యక్షుడు శివాజీ రాజా మరియు జనరల్‌ సెక్రటరీ నరేష్‌ల మద్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్న విషయం తెల్సిందే. తాను మా నిధులను దారి మల్లించినట్లుగా నిరూపిస్తే దేనికైనా సిద్దం అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. అదే రోజు నరేష్‌ మాట్లాడుతూ మా నిధులు ఖచ్చితంగా దారి మళ్లాయి. దాని కోసం ఫ్యాక్ట్స్‌ ఫైడ్డింగ్‌ కమిటీ వేయాల్సిందే అంటూ ఆయన డిమాండ్‌ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మా పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మా పెద్దలు కూడా ఈ వివాదంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. చిరంజీవి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న కారణంగా ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది.

naresh

త్వరలో సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్బంగా ఫండ్‌ రైజింగ్‌ కోసం మహేష్‌బాబు ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అందుకు సంబంధించి నిర్వాహకులతో మా కోటి రూపాయలకు గాను ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ వివాదంతో మహేష్‌బాబు ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది. మహేష్‌బాబు ఆ కార్యక్రమంలో పాల్గొనకపోతే మా అడ్వాన్స్‌ డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కార్యక్రమంకు రెండు నుండి మూడు కోట్లు వచ్చే అవకాశం ఉండగా, నిర్వాహకులు మాత్రం కోటి రూపాయలు మాత్రమే ఇస్తున్న కారణంగా నరేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. శివాజీ రాజా తక్కువ మొత్తంకు తనకు సన్నిహితులైన వారికి కార్యక్రమ నిర్వాహణకు అవకాశం ఇచ్చాడు అంటూ నరేష్‌ అంటున్నాడు. అందుకే మహేష్‌బాబు కార్యక్రమంను క్యాన్సిల్‌ చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

naresh-siva-raju