బన్నీతో సమంత ఫిక్స్‌…!

Allu Arjun And Samantha Team Up For Vikram Kumar Film

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్‌తో తదుపరి చిత్రానికి చాలా గ్యాప్‌ తీసుకుంటున్నాడు. ఇటీవలే ఆలస్యం అయినా మంచి చిత్రంతో వస్తాను అంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. హామీ మేరకు మంచి స్క్రిప్ట్‌తో మస్త్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఒక మంచి సినిమాను చేసేందుకు బన్నీ సిద్దం అవుతన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మనం, 24 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ తదుపరి చిత్రం తెరకెక్కబోతుంది. విక్రమ్‌ కుమార్‌ తీసుకు వచ్చిన స్క్రిప్ట్‌ను తన సన్నిహితులతో మార్పులు చేర్పులు చేయించి, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడివ్వడంతో పాటు, ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే సాగడంకు ప్రణాళిక చేయడం జరిగింది.
allu-narjun
త్వరలోనే అల్లు అర్జున్‌, విక్రమ్‌ కుమార్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్లబోతుంది. అంతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రటక రాబోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేయాలని దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ భావిస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్‌ మరియు సమంతల కాంబినేషన్‌లో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి వీరిద్దరు జత కట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ తుది దశకు చేరుకున్నాయి. దసరా వరకు సినిమాను ప్రారంభించి, వచ్చే దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అనేది విక్రమ్‌ కుమార్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ నిర్మించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

allu-arju-samantha