భైరవగీత ఏదో ఏదో సాంగ్ వీడియో – ఆర్జీవీ మార్కుతో సెగలు పుట్టించే పాట

Bhairava-Geetha--Edho-Edho-

ఏ క్షణాన రామ్ గోపాల్ వర్మ భైరవగీత సినిమాని సమర్పిస్తూ, ప్రమోట్ చేయడం మొదలెట్టాడో తెలియదుగానీ ఆ క్షణం నుండి ఈ సినిమా గురించి విడుదలవుతున్న ప్రతి అప్డేట్ ఈ సినిమా మీదున్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఈ సినిమాలో కన్నడ నటుడు ధనంజయ హీరో కావడం, తెలుగు మరియు కన్నడ భాషల్లో సినిమాని విడుదల చేయబోతుండడం, విడుదలైన రెండు ట్రైలర్లలో చూపించిన మితిమీరిన హింస, శృంగారం సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాక, ఆ ట్రైలర్ లలో కనిపిస్తున్న పోరాట దృశ్యాలు ఈ సినిమాలో మంచి కథ ఉంటుందని తెలుపుతున్నాయి. ఈరోజే సినిమా రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేయగా, ఇప్పుడు ఈ సినిమా నుండి ఒక వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

bhairava geetha movie teaser release on tomorrow

ఏదో ఏదో అనే లిరిక్ తో మొదలయ్యే ఈ పాట వీడియో ని చూస్తే, ఇది ఫక్తు ఆర్జీవీ మార్కు పాట లా ఉంది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య నడిచే ఇంటిమేట్ సన్నివేశాలు తెలుగులో ఇంతవరకు వచ్చిన ఇంటిమేట్ వీడియో పాటల హద్దుల్ని చెరిపేసేలా ఉండి, మాస్ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా మోతాదుకు మించి రొమాన్స్ జతచేశారా అనిపిస్తుంది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన అడవి, రౌడీ, సత్య, ఐస్ క్రీం సినిమాల్లో ఆర్జీవీ ఇలాంటి పాటలే తెరకెక్కించి ఉండడం, వాటికి మక్కీకి మక్కి గా ఈ వీడియో సాంగ్ ఉండడంతో “ఆశ్చర్యం లేదు…ఈ పాట ఆర్జీవీ నే తీసుంటాడు” అని చూసిన ప్రతొక్కరూ అనుకోవడం ఖాయం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇర్రా మోరే మోతాదుకు మించి తన అందాలని ప్రదర్శించగా, ఇద్దరిమధ్య తెరకెక్కించిన రొమాన్స్ ఔరా అనేలా ఉన్నాయి.