భైరవగీత రిలీజ్ డేట్ – డిసెంబర్ 7

Bhairava Geetha Movie Release On December 7th

రిలీజ్ డేట్ : డిసెంబర్ 7
నటీన‌టులు: ధ‌నంజ‌య్, ఇర్రా మిర్ర‌ర్
ద‌ర్శ‌కుడు : సిద్ధార్థ్ తాతోలు
నిర్మాత‌లు : అభిషేక్ నామా, భాస్క‌ర్ ర‌స్సీ
స‌మ‌ర్ప‌కులు : రామ్ గోపాల్ వ‌ర్మ
సంగీత ద‌ర్శ‌కుడు: ర‌వి శంక‌ర్
క‌థ‌, స్క్రీన్ ప్లే:  రామ్ గోపాల్ వ‌ర్మ/రామ్ వంశీకృష్ణ
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి ఎమ్ఎఫ్ఏ
ఎడిట‌ర్: అన్వ‌ర్ అలీ

Ram Gopal Varma Bhairava Geetha To Release In Four South Languages ,
ధనుంజయ్, ఐరా మోర్ హీరో హీరోయిన్‌లుగా రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌ణలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘భైరవగీత’. అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. 2.ఓ చిత్రానికి పోటీగా తమ చిత్రం విడుదలవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రచారం కూడా చేశారు. పెద్ద దర్శకుడి చిత్రానికి పోటీగా చిన్న దర్శకుడి చిత్రం విడుదల చేస్తున్నామని ఆయన ట్వీట్‌లు కూడా చేశారు.  అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. భైరవగీత చిత్రం విడుదలని వాయిదా వేస్తున్నట్లు వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ‘‘కొన్ని సెన్సార్‌ సాంకేతిక కారణాల వల్ల సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన భైరవగీత సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నాం. ఈ ఎన్నికల రోజు మీ ఓటు భైరవ గీత సినిమాకు వేయండి’’ అంటూ ఆర్‌జీవీ ట్వీట్ చేశారు.