రజినీకాంత్ ఎంట్రీ సీన్ కోసం థియేటర్లో 2.0 సినిమాను ఆపేశారంట

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమానా మజాకా. రజినీకాంత్ ఎంట్రీ సీన్ ని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోడానికి ఏకంగా రోబో 2.0 సినిమాని మూడు నిమిషాల పాటు ఆపింది చెన్నై లోని ఒక థియేటర్ యాజమాన్యం. రోబో సినిమా తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న రోబో 2.0 సినిమాకి ఆకాశాన్ని అంటే క్రేజ్ ఉండడంతో పాటు, ఈ సినిమా తో రజినీకాంత్ మళ్ళీ హిట్టు కొట్టడం ఖాయం అని రజిని అభిమానులకి నమ్మకం ఉండడంతో, యావత్ భారతదేశమంతా ఈ సినిమా విడుదల కోసం పడిగాపులు కాస్తూ, ఎదురుచూసింది. ఇక సినిమా ఈరోజే విడుదల అవ్వుతుండడంతో థియేటర్ల దగ్గర రజని అభిమానులు పండుగ లా సంబరాలు జరుపుకుంటున్నారు.

రజినీకాంత్ ఎంట్రీ సీన్ కోసం థియేటర్లో 2.0 సినిమాను ఆపేశారంట - Telugu Bullet

తాము ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న సినిమా అవ్వడంతో పాటు, రోబో సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ మీద అభిమానం ఉండడంతో, ఈ 2.0 సినిమాలో రజినీకాంత్ కనిపించే మొదటి షాట్ ని కనులారా చూస్తూ, సెలెబ్రేట్ చేసుకుంటామని రజిని అభిమానులు చెన్నైలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్ యాజమాన్యాన్ని కోరారు. రజిని అభిమానుల కోరిక సబబే అని భావించిన యాజమాన్యం రజిని ఇంట్రడక్షన్ సీన్ ని ఒక మూడు నిముషాలు అలాగే స్క్రీన్ పై ఉంచేలా చేసి, రజని అభిమానులకి సెలెబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్నీ రజని అభిమానులు స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి, రోబో సినిమా మేనియా ఎలా ఉందొ అందరికి చెప్పుకుంటున్నారు.