నిను వీడని నీడను నేనే ఫస్ట్ లుక్ – సందీప్ కిషన్ నిర్మిస్తున్న హార్రర్ చిత్రం

Sundeep-Kishan-Ninnu-Veedan

సరైన హిట్టు కొట్టడం కోసం సందీప్ కిషన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. వేంకటాద్రి ఎక్సప్రెస్స్ సినిమాతో ఘనవిజయం సాధించిన సందీప్ కిషన్ ఆ తరువాత చేసిన సినిమాలన్నీ ప్లాపులే. ఎలాగైనా హిట్టు కొట్టాలని అన్ని జానర్లని టచ్ చేస్తూ సినిమాలు తీస్తున్నా ఫలితం దక్కకపోవడంతో, తమిళంలో తాను నటించిన కొన్ని సినిమాలు బాగా ఆడి తనకి మంచి పేరు సంపాదించిపెట్టడంతో ఆ మధ్య పూర్తిగా తమిళం పైనే దృష్టిపెట్టినా ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాలు, తమిళ సినిమాలను బ్యాలన్స్ చేస్తూ సినిమాలు చేస్తూ సరైన విజయం కోసం తహతహలాడుతున్నాడు. ఈ పనిలో భాగంగా తెలుగులో నెక్స్ట్ ఏంటి అనే హిందీ రీమేక్ చిత్రం చేస్తుండగా, 16 అనే సినిమాతో ప్రేక్షకులని ఆశ్చర్యపరిచిన కార్తీక్ నరేన్ తీస్తున్న రెండవ చిత్రం నరకాసురుడు సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.

 

 

Sundeep-Kishan

తనకి నచ్చిన కథలని రాజీ పడకుండా సినిమాలుగా నిర్మించాలని అనుకున్న సందీప్ కిషన్ తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని ప్రారంభించాడు. తనకు హిట్టు ఇచ్చిన వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమా పేరు కలిసొచ్చేలా “వేంకటాద్రి టాకీస్” అని తన ప్రొడక్షన్ హౌస్ కి పేరు పెట్టుకొని, మొదటి చిత్రంగా “నిను వీడని నీడను నేనే” అనే హార్రర్ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన అనన్య సింగ్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో కార్తిక్ రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మొదలవుతున్న రోజుని పురస్కరించుకొని ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశాడు సందీప్ కిషన్. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండడంతో పాటు, కథేమిటా అని చూసిన వీక్షకులు ఆలోచించేలా ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు.

Sundeep kishan Turns Producer To Revive Career