తెలుగులో మళ్ళీ అదృష్టం పరీక్షించుకోబోతున్న హన్సిక

Hansika-Motwani-To-Team-Up-

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి తన 16 వ ఏటనే దిగుమతి అయిన హన్సిక దేశముదురు సినిమాలో తన లేత అందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరువాత వెంటనే జూ. ఎన్టీఆర్ తో కంత్రి సినిమాలో నటించే అవకాశం దక్కించుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుందమనుకునేలోపు కంత్రి సినిమా అట్టర్ ప్లాప్ అయ్యేసరికి, మళ్ళీ రామ్ తో మస్కా సినిమాలో నటించి మెప్పించింది. దీని తర్వాత చేసిన మరో మూడు సినిమాలు అంతగా ఆడకపోయినా, రామ్ తో కలిసి చేసిన రెండో సినిమా కందిరీగ మంచి విజయాన్నే సాధించిపెట్టింది. ఈలోపు తమిళంలో కూడా ఆఫర్స్ వచ్చేసరికి, అక్కడివారికి నచ్చేందుకు బొద్దుగా తయారయ్యి, జూ. కుష్బూ అనే పేరు సంపాదించుకుంది.

Hansika-Motwani-sandeep

సిద్ధార్థ సరసన తెలుగులో చేసిన ఓ మై ఫ్రెండ్ సినిమాలో కనిపించిన హన్సిక ని చూసి, ముక్కున వేలేసుకోవడం ప్రేక్షకుల వంతయ్యింది. ఆ సినిమాలో హన్సిక ఎంత లావుగా కనిపించింది అంటే దాదాపు నమిత ఆకారాన్ని దింపేసింది తన ఆకారంతో. ఆ సినిమాకి వచ్చిన విమర్శలకి మళ్ళీ దారిలోకి వచ్చి, కాస్త సన్నబడి రవితేజ సరసన పవర్ సినిమాలో నటించాక, దాదాపు మూడు సవంత్సరాల తరువాత గోపీచంద్ తో గౌతంనంద సినిమాలో నటించిన హన్సిక ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యేసరికి , తన ఫోకస్ అంతా తమిళసినిమాలపైనే పెట్టి, అక్కడ మంచి మంచి ఆఫర్లు వస్తుండడంతో మంచి పేరు కూడా సాధించింది. మళ్ళీ ఇప్పుడు సవంత్సరానికి తెలుగులో మల్లి పలకరించబోతుంది హన్సిక. ఈ కొత్త సినిమాలో హన్సిక యువ హీరో సందీప్ కిషన్ సరసన నటిస్తుండగా, హాస్యచిత్రాలదర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడితో హన్సికకు ఇది రెండో సినిమా…వీరిద్దరూ ఇప్పటికే చేసిన దేనికైనా రెడీ సినిమాకూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది.

Hansika-Motwani