భైరవ గీత ట్రైలర్: ఆర్జివి సమర్పణలో మరో యథార్థ చిత్రం

Bhairava Geetha Official Telugu Trailer

భైరవ గీత – తెలుగు, కన్నడ భాషల్లో విడుదలవుతున్న చిత్రం. కన్నడ నటుడు ధనంజయ హీరో గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇర్ర మోరె హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ సినిమాకి సిద్ధార్థ తథోలు అనే 25 ఏళ్ళ కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక నామా నిర్మిస్తున్న ఈ సినిమాని రాంగోపాల్ వర్మ సమర్పిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.ట్రైలర్ ని గమనిస్తే, ఈ సినిమా పూర్తిగా యథార్థ సంఘటనల ఆధారంగా, రియలిస్టిక్ గా, ప్రేమ, కామం, పగ, ప్రతీకారం, అధికారం, పోరాటం వంటి విషయాలతో, నటీనటుల అభినయాలతో ఆసక్తికరంగా ఉంది.

bhiravadeepam-ram

ఇప్పటికే ధనంజయ కన్నడలో చేసిన తగరు సినిమాతో నటుడిగా తన నటన తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో కట్టిపడేసేలా నటించాడు. హీరోయినిగా నటించిన ఇర్ర మోరె కూడా అందంగా కనిపిస్తూ, హీరోతో లిప్ లాక్ సన్నివేశాలతో మరో RX 100 సినిమాని గుర్తుచేసింది. చాలామటుకు RX 100 సినిమాని గుర్తుచేసేలా ఉన్న ఈ సినిమాలో, అంతకు మించిన విషయం ఉందని ట్రైలర్ ని చూస్తుంటే తెలిసిపోతుంది.

bhirava-geetha

కొన్ని సన్నివేశాలని చూస్తే మాత్రం హాలీవుడ్ చిత్రం మాడ్ మాక్స్ – ఫ్యూరీ రోడ్ నుండి ఇన్ స్పైర్ అయినట్టుగా తెలుస్తుంది. రవి శంకర్ అందించిన సంగీతం ట్రైలర్ లోని ప్రతి సన్నివేశానికి గాఢత ని అందించింది. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని ఇంత ఇంటెన్స్ గా తీయలేడేమో అనిపిస్తుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒక లుక్ వేయండి. మళ్ళీ మళ్ళీ చూడకుంటే మమ్మల్ని అడగండి.