ప్రేమించిన వ్యక్తితో కలర్స్‌ స్వాతి పెళ్లి

colors swathi marriage

తెలుగు ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా పరిచయం అయ్యి, ఆ తర్వాత వెండి తెరకు పరిచయం అయిన కలర్స్‌ స్వాతి గురించి మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేశాయి. ఒక హీరోతో ఈమె ప్రేమ వ్యవహారం సాగిస్తుందని, అతడికి ముందే పెళ్లి అయ్యిందని, అతడిని రెండవ వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ రకరకాలుగా పుకార్లు వచ్చిన నేపథ్యంలో తాజాగా వాటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెట్టి స్వాతి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్‌ అయ్యేందుకు సిద్దం అయ్యింది.

colors-swathi-marriage

చాలా కాలంగా మలేషియన్‌ ఏర్వేస్‌లో జాబ్‌ చేస్తున్న వికాస్‌తో స్వాతి ప్రేమలో ఉంది. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు. ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు అయినా కూడా ఇద్దరు ప్రేమించుకోవడంతో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం అయిన విషయం తెల్సిందే. తాజాగా వీరి వివాహం నిరాడంబరంగా, బంధువులు, మిత్రుల సమక్షంలో జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ పరిశ్రమకు చెందిన వారు కనిపించలేదు. పెళ్లికి కేవలం బందువులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. సినీ ప్రముఖుల కోసం స్వాతి రిసెప్షన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.