ఎన్టీఆర్‌ రేపటి నుండే ‘అరవింద సమేత’ షూటింగ్‌లో..!

NTR To Resume Shooting From Tomorrow

నందమూరి హరికృష్ణ మరణంతో ఆ ఫ్యామిలీ మొత్తం తీవ్ర దుఖంలో మునిగి పోయింది. తండ్రిని కోల్పోయిన కళ్యాణ్‌ రామ్‌ మరియు ఎన్టీఆర్‌లు కన్నీరు మున్నీరు అయ్యారు. తండ్రి మరణంతో కనీసం పది రోజుల వరకు ఎన్టీఆర్‌ షూటింగ్‌కు రాకపోవచ్చు అంటూ అరవింద సమేత చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు. ఇంతలోనే త్రివిక్రమ్‌కు ఎన్టీఆర్‌ నుండి కాల్‌ వచ్చిందని, రేపటి నుండి మళ్లీ అరవింద సమేత చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాను అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం అవుతూ వచ్చిన అరవింద సమేత చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలి అంటే వర్క్‌ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేయాల్సి ఉంది.

ntr

ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా దసరాకు విడుదల చేయడం కష్టం అవుతుంది. సినిమా ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఫారిన్‌ షెడ్యూల్‌ను క్యాన్సిల్‌ చేసిన త్రివిక్రమ్‌ ఇప్పుడు హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్‌ షూటింగ్‌కు హాజరు అవ్వడం కష్టమే అని, దసరా విడుదలపై నమ్మకం పెట్టుకోలేదు. కాని ఎన్టీఆర్‌ మాత్రం తన వర్క్‌ డెడికేషన్‌ను మరోసారి చాటుకోబోతున్నాడు. తండ్రి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్నా కూడా సినిమా పూర్తి చేయానే ఉద్దేశ్యంతో రేపటి నుండే షూటింగ్‌కు హాజరు కాబోతున్నాడు. నేడు చిన్న కార్యం పూర్తి చేసిన కుటుంబ సభ్యులు రేపటి నుండి యదావిధిగా కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారు. తలకొరివి పెట్టిన కళ్యాణ్‌ రామ్‌ పది రోజుల వరకు బయటకు వెళ్లే అవకాశం లేదు, కాని ఎన్టీఆర్‌ మాత్రం రేపటి నుండే అరవింద సమేత షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు, రేపు ఎన్టీఆర్‌ షూటింగ్‌లో ఎలా ఉంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

junior-ntr