హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలపై మోజు…!

Kajal Interested In Heroine Oriented Films

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌కు ఈమద్య కాలంలో కాస్త అవకాశాలు తగ్గాయి. స్టార్‌ హీరోల చిత్రాల్లో ఛాన్స్‌లు రాకపోవడంతో ఈమె తెలివిగా చిన్న హీరోలతో సినిమాలు కమిట్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటూ చిన్న హీరోల చిత్రాల్లో నటిస్తున్న కాజల్‌ ప్రస్తుతం తమిళంలో ‘క్వీన్‌’ రీమేక్‌లో నటిస్తోది. అది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం అనే విషయం తెల్సిందే. తాజాగా మరో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. భాను శంకర్‌ చౌదరి దర్శకత్వంలో కాజల్‌ ఒక చిత్రంకు గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చింది.

kajal tamil movie queen

‘అర్థనారి’ అంటూ విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు భాను శంకర్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఒక స్క్రిప్ట్‌ను కాజల్‌కు వినిపించడం, ఆ స్క్రిప్ట్‌ కాజల్‌కు బాగా నచ్చడం జరిగి పోయిందట. దాంతో తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేసేందుకు ఆయన సిద్దం అవుతున్నాడు. తెలుగు మరియు తమిళంలో వేరు వేరు నటీనటులతో చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి కాజల్‌ వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తున్న కారణంగా ఆమె వద్దకు వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్‌ు వచ్చే అవకాశం ఉంది. అనుష్క మాదిరిగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు అనుష్క కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యేనా చూడాలి.

kajal2