పిచ్చెక్కిస్తున్న తెలుగు పత్రికలు.

Telugu Media channels wrote Different way in Parliament Meetings

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి… ఈ మూడు పత్రికలు ఏమి రాస్తాయో, ఎందుకు రాస్తాయో ఏ తెలుగోడిని అడిగినా చెబుతారు. ఆ పత్రికలు రాజకీయంగా ఇలాంటి వైవిధ్యాన్ని చూపినా కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ సాక్షాత్తు దేశ పార్లమెంట్ లో జరిగిన విషయాలను కూడా తలో రకంగా రిపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ఇన్నాళ్లకు అధికార, విపక్షాలు ప్రధాని మోడీ సమక్షంలోనే కేంద్రం మీద పోరాడే ధైర్యం చేస్తున్నాయి. నిజానికి కలిసికట్టుగా ఈ పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేదో గానీ అధికార, విపక్షాలు తాము చేస్తున్న పోరాటం సరైన దారిలో ఉందని, ప్రత్యర్ధులు మాత్రం డ్రామా ఆడుతున్నారని చెప్పేందుకు ట్రై చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన తెలుగు పత్రికలు చదివినవారికి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లో ఒకే విషయం మీద తలో రకమైన రిపోర్ట్ రావడంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి.

సామాన్యంగా ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోడానికి పత్రికలు చదువుతారు. కానీ ఇప్పుడు పత్రికలు చదువుతుంటే లేనిపోని కొత్త సందేహాలు పుట్టే పరిస్థితులు వస్తున్నాయి. దీంతో జనానికి రాజకీయ పార్టీలతో పాటు పత్రికల విశ్వసనీయత గురించి కూడా నమ్మకం పోతోంది. ఈ పరిణామాల మధ్య తెలుగు టీవీలు, పత్రికల కన్నా జాతీయ చానెల్స్ మీద ఆధారపడడం మేలని యువత అటు మళ్లుతున్నారు. అయితే పార్లమెంట్ కి సంబంధించిన విషయం కావడంతో అక్కడ కూడా ఓ పరిమితిలోనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక సభలో కెమెరాలు నినాదం వినిపించే వైపు ఫోకస్ కాదన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో నిజంగా ఏమి జరుగుతుందో అని ఆరాటపడే వాళ్ళు మాత్రం తెలుగు పత్రికలు చెప్పేది నమ్మలేక, జాతీయ చానెల్స్ లో విస్తృత కవరేజ్ లేక పిచ్చెక్కిపోతున్నారు.