బాబు ప్యాకేజీకి ఒప్పుకోడానికి కారణాలు ఏంటి?

Chandrababu says Reason Why we accept Special Package for AP
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ని కుదేపెస్తున్న అంశం ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అన్ని దీని చుట్టూనే తిరుగుతున్నాయి. విభజన రోజున కావాలి ఇవ్వాలి అని అన్న బిజేపి అధికారంలోకి వచ్చాక కాదు కుదరదు అని మాట మార్చింది, దానిది ఏముంది ఇచ్చేద్దాం అన్నా కాంగ్రెస్ ఏమో పార్లమెంట్ లో దాని ఊసే ఎత్తదు. కానీ ఎవరు ఊరుకున్నా జనం అయితే ఊరుకోరు కదా అందుకే ప్రత్యేక హోదా కుదరదు హోదాతో సమానమైన ప్యాకేజి ఇస్తాం అన్నారు. నాలుగు బడ్జెట్లు వెళ్ళిపోయాయి హోదా లేదు, ప్యాకేజి రాలేదు. దీనితో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ. కేంద్రం అంతు చూస్తాం బోలెడు కబుర్లు చెబుతుంది. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు మీద కూడా విరుచుకు పడుతుంది. బాబు రాష్టాన్ని మోడీకి తాకట్టు పెట్టారని. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాకు సమాధి కట్టారని, తన ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఇలా చాల రకాల ఆరోపణలు చేసింది. అందరు బాబునే టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్యాకేజీకి అంగీకరించడానికి గల కారణాలను వివరించారు.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్ద భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ఫ్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగాన్ని చంద్రబాబు నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని ఆయన తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం చెప్పిందని, అందుకే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నామని చంద్రబాబు చెప్పారు. కాగా, విభజన హామీల అమలుకు పోరాటం చేస్తామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయాలని కేంద్రంపై పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పనిలోపనిగా కేంద్రాన్ని ప్రతిపక్షాన్ని ఎండగట్టారు.

గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే, ప్రత్యేకహోదా ఇకపై ఏ రాష్ట్రానికి ఇవ్వం అని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిందని ఇప్పటికే ఆ హోదా పొందిన రాష్ట్రాలకు ఇంకా ఎందుకు ప్రత్యేకహోదాను కొనసాగిస్తోందని అడిగారు. అక్కడి రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ కొనసాగిస్తున్నప్పుడు, మా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరు? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మనం డిమాండ్ చేస్తున్నవన్నీ సహేతుకమైనవేనని, దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల కంటే తలసరి ఆదాయంలో తమ రాష్ట్ర తలసరి ఆదాయమే తక్కువగా ఉందని ఈ విషయం కేంద్రానికి తెలియదా అంటూ నిలదీశారు. హోదా, హామీల అమలు సాధన మన హక్కని, దానిని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన హితవు పలికారు.

పేరు చెప్పకుండా జగన్ ని, సాక్షిలకి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డంపై కొంద‌రు కేంద్ర ప్రభుత్వాన్ని నిల‌దీయ‌కుండా త‌న‌ను తిడుతున్నార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కొన్ని పార్టీల నేతలు నిద్ర‌లేచిన‌ప్ప‌టి నుంచి త‌న‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నార‌ని అన్నారు. ఒక న్యూస్‌ పేపరుందీ… ఆ పేపరు పేరు నేను చెప్పలేను మీకే తెలుసు… అసత్యాలు రాసీరాసీ అలసిపోతున్నారు… ఆ పేపరుని ఎవరైనా నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. మొత్తానికి తనపై వస్తున్నా ఆరోపణలు, విమర్శలు అన్నిటిని కలిపి ఒకేసారి తిప్పికొట్టారు.