సంయమనం… ఓపిక లేని పాము కథ.

Snake and Chainsaw special Story
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపైన దాడి చేస్తుందనుకొని, వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా ఉపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది.

మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.

_జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్నిసార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది.