Election Updates: ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Madhya Pradesh CM's selection is today... Will Shivraj Singh get another chance?
Madhya Pradesh CM's selection is today... Will Shivraj Singh get another chance?

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ రాత్రికే విడుదల కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ జరుగనుంది. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్,లక్ష్మణ్ ఢిల్లీకి చేరుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో ప్రత్యేక భేటీలు జరుగనున్నాయి. తెలంగాణలో అభ్యర్థుల ఖరారు, రూట్ మ్యాప్ లపై ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో తెలంగాణ రాష్ట్ర నేతలు చర్చలు జరుపనున్నాయి. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

కాగా, తెలంగాణ వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ కారణమని కిషన్ రెడ్డి అన్నారు . కర్ణాటకలో కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ కారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ మంత్రి డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు .