కేసీఆర్ కు సూసైడ్ వార్నింగ్….24 గంటల్లో టికెట్ ఇవ్వకపోతే…?

Former MLA Odels Suicide Attempt In Home
అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవల కేసీఆర్ 105 అభ్యర్థులతో టీఆర్ఎస్ తొలిజాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది ఆశావహుల పేర్లు గల్లంతయ్యాయి. చెన్నూరు టికెట్ ను టీఆర్ఎస్ అధినేత ఈసారి ఎంపీ బాల్క సుమన్ కు కట్టబెట్టారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ఓదేలు రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ తనకు ఇవ్వలనేదని మనస్థాపంతో అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వయంగా గృహనిర్బంధం వెళ్లారని సమాచారం అందుతోంది. తన ఇంట్లోనే తాళం వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఓదెలుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా గృహనిర్బంధంలోనే ఉన్నారు.
odalu-kcr
24 గంటల్లో టికెట్‌పై హామీ రాకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా ఓదెలు ప్రకటించడం ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టికెట్ ఎందుకు ఇవ్వరని ? అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను తప్పించి ఎక్కడో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సుమన్ కు టికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.  చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశాననీ, అలాంటి తనను పక్కకు తప్పించడం దారుణమని ఓదేలు వాపోయారు. తనకేదయినా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ దే బాధ్యతని స్పష్టం చేశారు.
odelu-kcr-formar