ఆగిపోయిన సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి…

tollywood movies releasing in november 2017

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దసరా చిత్రాల సందడి తగ్గిన తర్వాత వచ్చిన చిత్రాలు ‘రాజుగారి గది 2’, ‘రాజా ది గ్రేట్‌’. ఈ రెండు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ వారం రెండు చిత్రాలు ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ మరియు అనగనగా ఒక దుర్గ విడుదల అయ్యాయి. ఈ రెంటితో పాటు విజయ్‌ అదిరింది కూడా విడుదల అవ్వాల్సి ఉంది. కాని సెన్సార్‌ కారణాల వల్ల విడుదల కాలేదు. త్వరలోనే ఆ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక వచ్చే వారం నాలుగు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ తర్వాత వారం కూడా నాలుగు అయిదు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

డిసెంబర్‌ మరియు జనవరిలో పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో నవంబర్‌లో విడుదల ఆలస్యం వస్తున్న చిత్రాలు, ఏవో కారణాల వల్ల ఆగిపోయిన చిత్రాలు విడుదల కాబోతున్నాయి. నవంబర్‌లో అందరి దృష్టిన ఆకర్షిస్తున్న కొన్ని చిత్రాలు ఉన్నాయి. అవి గరుడవేగ మరియు ఒక్కడు మిగిలాడు. ఈ రెండు సినిమాలు మినహా మిగిలిన అన్ని చిత్రాలు కూడా ప్రేక్షకులకు కనీసం నోటెడ్‌ కూడా కాలేదు. నవంబర్‌లో ప్రధానంగా విడుదల కాబోతున్న సినిమాలు ఏంటీ అంటే.. నెక్ట్‌ నువ్వే, ఏంజెల్‌, గృహం, కేరాఫ్‌ సూర్య, లండన్‌ బాఋ, దేవిశ్రీ ప్రసాద్‌, ఆక్సీజన్‌, రారా. ఈ చిత్రాల్లో ఏది ప్రేక్షకుల ఆధరాభిమానాన్ని పొందుతాయో చూడాలి.