సమంత ని రెఫర్‌ చేసిన రానా

సమంత ని రెఫర్‌ చేసిన రానా

స్టార్‌ హీరోయిన్‌ సమంత తొలిసారిగా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. ‘డోంటన్ అబ్బే’ఫేమ్‌ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

అయితే బాలీవుడ్‌ బడా హీరోయిన్స్‌ని కూడా పక్కనపెట్టి సమంతకు ఈ ఆఫర్‌ ఎలా వచ్చిందంటూ సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. సమంతతో ఓ బేబీ చిత్రాన్ని నిర్మిఇంచిన సునీతా తాటి హోం బ్యాన‌ర్‌ గురు ఫిలిమ్స్ ఇప్పుడు అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఫీమేల్‌ లీడ్‌ కోసం వెతుకుతున్న సమయంలో ఆ పాత్రకు సమంత అయితే బాగుంటుందని రానా రెఫర్‌ చేశాడటని సమాచారం.ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సమంత అయితే ఈ పాత్రకు సరిగ్గా సూట్‌ అవుతుందని రానా సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.