టాలీవుడ్ ముందు చిన్నబోయిన బాలీవుడ్ హీరోలు

టాలీవుడ్ ముందు చిన్నబోయిన బాలీవుడ్ హీరోలు

గత కొన్నేళ్లలో హిందీ సినిమాల రికార్డుల్ని ‘బాహుబలి’ ఎలా బద్దలు కొట్టి వాటికి సవాలు విసిరిందో తెలిసిందే.కంటెంట్ పరంగా చూస్తే ‘బాహుబలి’ని మించిన సినిమాలు వస్తున్నాయి ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి చాలా సినిమాలు అక్కడ రీమేక్ కూడా అవుతున్నాయి.

దీంతో బాలీవుడ్ సత్తా మీద సందేహాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రకమైన ఇబ్బందికి తోడు ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వానికి చేయూత అందించేందుకు టాలావుడ్ స్టార్లు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు.

ప్రభాస్ ఏకంగా రూ.4 కోట్ల విరాళం అందిస్తే.. మిగతా స్టార్లు కోటికి అటు ఇటుగా విరాళాలు ప్రకటించారు. దేశం మొత్తంలో మన హీరోల మాదిరి స్పందిస్తున్న హీరోలు మరే ఇండస్ట్రీలోనూ లేరు. తమిళ స్టార్లు కూడా ముందుకొచ్చారు కానీ.. మన వాళ్ల ముందు వాళ్ల విరాళాలు చిన్నమొత్తమే.

ఇక బాలీవుడ్ వాళ్లయితే తమ దాతృత్వాన్ని చాటుకోవాల్సిన వేళ తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారు. ఖాన్ త్రయం సహా ఎవ్వరూ ఇప్పటిదాకా స్పందించలేదు. టాలీవుడ్ స్టార్ల విరాళాల గురించి జాతీయ స్థాయిలో వార్తలొస్తున్నాయి.

వాళ్లను రియల్ హీరోలుగా పొగుడుతున్న సోషల్ మీడియా.. బాలీవుడ్ హీరోల గాలి తీస్తోంది. ఈ సమయంలో కూడా మీరు స్పందించరా అంటూ నిలదీస్తోంది. మరి అక్కడి స్టార్లు ఎప్పటికి స్పందిస్తారో చూడాలి