కేటీఆర్ కు ట్విటర్లో రివర్స్ పంచ్ లు

Twitter Reverse Punches To KTR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Twitter Reverse Punches To KTR

కేటీఆర్ ముందే తెలిసి కూడా జనానికి ఛాన్స్ ఇచ్చారు. ఆట పట్టించినా పర్లేదంటూ తనకు నచ్చిన విషయాన్ని ట్వీట్ చేశారు. హైదరాబాద్ రోడ్లు ఢిల్లీలో ఉండాలంటూ కేటీఆర్ చేసిన ట్వీట్లు దుమారం రేపాయి. ఆయన ఊహించినట్లుగానే రీట్వీట్లలో హైదరాబాద్ లో మురికి కూపాల్లాంటి రోడ్లు, పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ దర్శనమిచ్చాయి.

కానీ స్పోర్టివ్ గా తీసుకున్న కేటీఆర్.. ఇవన్నీ ముందే ఊహించానని సన్నిహితుల దగ్గర చెప్పారట. కేటీఆర్ విమర్శల్ని కూడా లైట్ తీసుకుంటూ.. అవసరమైన చోట స్ట్రెస్ చేస్తూ కేసీఆర్ కు సరైన వారసుడిగా ఎధుగుతున్నారని గులాబీ నేతలు సంబరపడుతున్నారు. కానీ కేటీఆర్ ట్వీట్లకే పరిమితం అవుతారా.. నిజంగా హైదరాబాద్ రోడ్లు బాగుచేస్తారా అనేది చూడాల్సి ఉంది.

అటు జీహెచ్ఎంసీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఢిల్లీ రోడ్లను చూసిన అధికారులు.. అలా హైదరాబాద్ తయారు కావాలంటే చాలా కష్టమని చెబుతున్నారు. ఢిల్లీ లెవల్లో హైదరాబాద్ కు నిధులు రావని, ఢిల్లీలో రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారని, ఇలా సాకులు రెడీ చేసేశారట. మరి కేటీఆర్ ఈ సాకులకు ఏం సమాధానం చెబుతారో.