ఉబెర్ లో కొత్త రైడ్ ఫీచర్

ఉబెర్ లో కొత్త రైడ్ ఫీచర్

”ఉబర్ పెట్” రైడ్ ఫీచర్ త్వరలో ఉబెర్లో రిలీజ్ అవ్వనుంది. ఇక నుంచి ట్రావెల్ చేసే సమయంలో పెంపుడు జంతువులును కూడా ఉబెర్ అనుమతించనుంది. ట్రావెల్ సమయంలో ప్రయాణికులు వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లలా కొత్త రైడ్ ఆప్షన్ ఉబెర్ లో రానుంది.

ఈ ఫీచర్ పై ఉబెర్ సంస్థ అక్టోబర్ 16 నుంచి టెస్టింగ్ చేయనుంది. ముందుగానే ప్యాసింజర్ల వెంట పెట్స్ ఉన్న సమాచారం ఈ ఫీచర్ ద్వారా డ్రైవర్లకు తెలుస్తుంది. ఈ కొత్త రైడ్ ఆప్షన్ మాత్రం ఉచితంగా కాకుండా కొద్ది ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని కంపెనీ తెలిపింది. ఇండియాలో ఎప్పుడు ఈ ఆప్షన్ వస్తుందనేది ఇంకా వెల్లడి అవలేదు.