ఇక పోర్న్ చూడాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలట !

పోర్న్ వీడియోలు చూడాలంటే 18 ఏళ్లు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పోర్న్ వెబ్‌సైట్లలో18+ వయస్సు వారికే ప్రవేశం అనే బటన్ కూడా ఉంటుంది. అయితే, అది నామమాత్రమే 18 ఏళ్ల లోపు వయస్సు పిల్లలు కూడా ఆ బటన్ నొక్కి పోర్న్ వీడియోలు చూసేయొచ్చు. కానీ, ఇకపై ఆ వీడియోలు చూడాలంటే తప్పకుండా యూజర్ తప్పకుండా తమ వయస్సు 18+ అని నిరూపించే ధ్రువీకరణ వివరాలను సమర్పించాలి. యూకేలో తొలిసారిగా జులై 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. పోర్న్ వీడియోలు చూడాలంటే యూజర్లు తమ బర్త్‌ సర్టిఫికెట్ఆన్‌లైన్లో సమర్పించాలి. ప్రస్తుతం ఇండియాలో పోర్న్ వెబ్‌సైట్లు నిషేదం ఉన్న నేపథ్యంలో ఎవరీ ఆ అవసరం ఉండకపోవచ్చు. అయితే, యూకేకు చెందిన పోర్న్ వెబ్‌సైట్లను చూడగలిగే సదుపాయం ఉన్నవారికి మాత్రం ఈ తిప్పలు తప్పవు.