జీవితాల్ని మార్చే శక్తి చదువుదే….

జీవితాల్ని మార్చే శక్తి చదువుదే

పునీత్ కొత్తాప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

అది 2005…నెల్లూరు కూరగాయల హోల్ సేల్ మార్కెట్. కూరగాయలు అమ్ముకుంటున్న తండ్రికి సాయంగా ఉందామని వస్తున్న రవి (పేరు మార్చాం) దృష్టిని ఓ వార్తాపత్రిక ఆకర్షించింది. ఐఐటీలో చదువుతూ ఉద్యోగాలు పొందిన వారి జీతభత్యాలు గురించిన వార్త రవిని నోరు వెళ్ళబెట్టేలా చేసింది. ఉద్యోగాల్లో ఇంతింత జీతాలు వుంటాయని అతను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అలాంటి అవకాశం ఉందన్న విషయాన్ని అతను తేలిగ్గా తీసుకోలేదు. ఆ పత్రికను జాగ్రత్తగా దాచుకున్నాడు. ఐఐటీతో జీవితాలు మారతాయని రవికి ఓ నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ఓ ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడూ బంధువులకి,స్నేహితులకి ఫోన్ చేయడానికి అక్కడికి వెళ్లే రవి బుర్రలో ఇంకో నెంబర్ తిరుగుతోంది. అది నెల్లూరులోని నారాయణ జూనియర్ కాలేజీ ది. ఆ ఫోన్ కాల్ తర్వాత రవి అదే కాలేజీ లో చేరిపోయాడు. ప్రస్తుతం రవి తండ్రి వెంకటకి పాస్ పోర్ట్ వచ్చింది. గూగుల్ ఉద్యోగిగా పనిచేస్తున్న రవి తన తండ్రికి శాన్ ఫ్రాన్సిస్కో చూపిద్దామని ఏర్పాట్లు చేసుకున్నాడు. చదువు జీవితాల్ని ఇంతలా మార్చేస్తుంది. బంగారం, భూమి, వారసత్వ సంపద కన్నా ఎక్కువగా వ్యక్తిగత జీవితాల్ని మాత్రమే కాదు మొత్తం దేశాన్నే మార్చేస్తుంది.

నారాయణ ప్రస్థానం

1979 నుంచి నారాయణ విద్యాలయం ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ సంస్థకి ప్రాణం పోసిన డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్య యొక్క శక్తిని బాగా గుర్తించారు. చదువుతో పేదరికాన్ని అధిగమించవచ్చని, ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని భావించారు. ఆయన కలలకు తగ్గట్టు నారాయణ గ్రూప్ కొందరు వ్యక్తులు, కుటుంబాల్లో మాత్రమే కాదు దేశపు దిశను కూడా మార్చేసింది. ప్రతి ఏటా 500 మంది నారాయణ విద్యార్థులు ఐఐటీ ల్లో చదువుకొనే అర్హత సాధిస్తున్నారు. ఇంకా కొన్ని వేల మంది ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్య అభ్యసిస్తున్నారు. వీరంతా దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ,అద్భుత ఆవిష్కరణల్లో పాలు పంచుకుంటున్నారు.

Related image

“ భవిష్యత్ ని ఊహించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే దాన్ని నిర్మించడమే “…ఈ ఆలోచనావిధానమే నారాయణ సంస్థ ప్రస్థానానికి ఇంధనం గా పని చేస్తోంది. దానికి సాక్ష్యంగా నారాయణ లో 6 నుంచి 12 దాకా చదివే విద్యార్థులు సైతం అటల్ టింకెరింగ్ లాబ్స్ లో సరికొత్త ఆలోచనలు , సృజనాత్మక ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మేధో శ్రమ దేశపు దశదిశను మార్చడానికి వేసే పునాది. ఇక్కడ ప్రయోగశాలలు నామ మాత్రం కానే కాదు. 3 డి ప్రింటర్స్ , రోబోటిక్స్ , ఎలక్ట్రానిక్ పరికరాలు , లాట్& సెన్సార్లు వంటి వాటితో విద్యార్థులు నవ్య దిశలో అడుగులు వేయడం సర్వసాధారణ దృశ్యం. పాఠశాల విద్య లో నారాయణ గ్రూప్ చేస్తున్న ఈ ప్రయోగాలు అద్భుత ఫలితాలు సాధించడమే కాదు …విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలకి బీజం వేస్తోంది. సమస్యల పరిష్కారంలో నారాయణ గ్రూప్ అనుసరిస్తున్న పద్ధతులు , విద్యార్థులు చేస్తున్న నవీన ఆలోచనలు ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రభాగాన నిలిచిన నాసా స్పేస్ సెటిల్మెంట్ పోటీలో నారాయణ గ్రూప్ నెంబర్ 1 స్థానాన్ని ఇంకోసారి నిలబెట్టుకుంది.

భారతీయ విద్యార్థి అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గడం కఠినాతికఠినమైన పరీక్ష అని ఓ భావన. ఈ సందర్భాల్లో పిల్లల మీద వుండే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల సంపూర్ణ మానసిక ఆరోగ్యం కోసం “దిశ” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మానసిక శాస్త్ర నిపుణులు సవాళ్లు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆసరాగా నిలుస్తూ వారి వ్యక్తిత్వాన్ని సమగ్రంగా , సంపూర్ణంగా మలుస్తున్నారు. కేవలం ఓ ఉన్నతమైన ఆలోచన దగ్గరే ఆగిపోకుండా దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది నారాయణ సంస్థ . విద్య నేర్చుకునే క్రమంలో ఒత్తిడి ఎదుర్కొనే ప్రతి ఒక్కరు తేలిగ్గా ఆశ్రయించే విధంగా హెల్ప్ లైన్స్ ప్రారంభించింది. తద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థుల ప్రాణాలు ఒత్తిడికి తలొగ్గకుంగా రక్షిస్తోంది.

నేహా , రాజు లాంటి భవిష్యత్ ఇంజినీర్లు , డాక్టర్లకి ఏమి కావాలి ? .మంచి విద్య , మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యత. దీంతో పాటు నైతిక విలువలు , సత్ ప్రవర్తన , హేతుబద్ధమైన ఆలోచనాసరళి ఉంటే దేశానికి బలమైన పౌరుడు అవుతాడు. అది సాధించాలంటే శారీరక,మానసిక దృక్కోణాలని దృష్టిలో వుంచుకోవడంతో పాటు ఆత్మ కలిగిన విద్యా విధానం ఈ దేశపు బాలలకు అవసరం.