జెర్సీ స్టోరీ ఆ క్రికెటర్ దేనా ?

ఈరోజు నాని సినిమా జెర్సీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా కధ రామణ్ లాంబా అనే క్రికెటర్ కధలా ఉండనుందని ముందు నుండీ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఖండించింది. అయితే ఈరోజు సినిమా రిలీజ్ అవగా ఆ సినిమా మొత్తం కాకపోయినా కొంత వరకూ ఇది రామణ్ లాంబా జీవితంలాగే అనిపించింది. భారత జట్టుకు ఆయన ఆడుతుండగా షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తు బంగ్లాదేశ్ ఆటగాడు మెహ్రబ్ హుస్సేన్ కొట్టిన షాట్ కు కుప్పకూలిపోయాడు. మూడు రోజుల కోమాలో ఉన్న అనంతరం లాంబా మృతి చెందాడు. సినిమాలో కూడా క్లైమాక్స్ అలాగే ఉండడం ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీస్తోంది. 80ల్లో ఈయన ఒక సంచలన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీలో అద్భుతాలు చేశాడు రమన్ లాంబ‌. అయితే ఇండియన్ క్రికెట్ కు మాత్రం కోరుకున్న స్థాయిలో సేవలు అందించలేకపోయాడు. ఇప్పుడు జెర్సీ సినిమా కథ కూడా ఇలాగే ఉండబోతుంది. జీవితంలో పనికిరాడు అనుకున్న ఒక క్రికెటర్ తన కలను సాకారం చేసుకున్నాడు అనేది ఈ చిత్ర కథ. ఇక ఈ సినిమాలో నెగటివ్ ఎండింగ్ ఉంటుందని తెలుస్తోంది. 1998లో ఢాకాలో జ‌రుగుతున్న ఒక మ్యాచ్ లో బాల్ త‌గిలి కన్నుమూసాడు లాంబ‌. ఇప్పుడు జెర్సీ సినిమాలో కూడా ద‌ర్శ‌కుడు గౌతం తిన్ననూరి నెగిటివ్ ఎండింగ్ రాసుకున్నాడని తెలుస్తోంది.