జెర్సీ తెలుగు బుల్లెట్ రివ్యూ

నటీనటులు : నాని , శ్రద్దా శ్రీనాథ్ , సత్యరాజ్
సంగీతం : అనిరుధ్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
న్యాచురల్ స్టార్ నాని నటింటించిన జెర్సీ ఈరోజు రిలీజయింది. క్రికెట్ నేపధ్యంలో ఈ సినిమాని మళ్ళీ రావా ఫేం గౌతం తెరకెక్కించాడు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీ నాథ్ హీరోయిన్ గా నటించింది. ఇదివరకే విడుదలైన ట్రైలర్ నుంచి భారీ అంచనాలు రేపింది సినిమా మీద. మరి ఈ సినిమా ఆ మేరకు అంచనాలు అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ
అర్జున్ (నాని)ఒక సత్తా ఉన్న క్రికెట్ ఆటగాడు గా అదరగొడుతుంటాడు. తనకున్నలక్ష్యాన్ని చేరుకునే దిశలో ఉన్నపుడు అనుకోకుండా నాని జీవితంలోకి సారా(శ్రద్దా) ఎంట్రీ ఇస్తుంది. సారా, అర్జున్ ల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది. కొన్ని కారణాల వలన ప్రేమలో ఉన్న వారు తొందరపడి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది దీంతో అతని జీవితంలో ఎంతగానో ఇష్టపడ్డ క్రికెట్ ని వదిలేసుకోవాల్సి వస్తుంది. వారి ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుడతాడు. ఆ బాబు పేరు నాని(రోనిత్ కమ్ర). అర్జున్ క్రికెట్ ని వదిలేసి ఎలాంటి జాబ్ చేయలేక ఉన్న పరిస్థితుల్లో కుటుంబ బాధ్యత మొత్తం సారా మోస్తుంటుంది. అర్జున్ కి నాని అంటే చాలా ఇష్టం నాని కి కూడా అర్జున్ అంటే చాలా ఇష్టం. కొడుకు దృష్టిలో తండ్రి ఒక హీరో. ఆ లెవెల్ లోనే ఉండటానికి అర్జున్ ఎంతగానో కష్టపడుతుంటారు. ఏ జాబ్ చేయలేని అతని చేతిలో ఎలాంటి డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడుతూ.. అందరితో అవమానాలు ఎదుర్కొంటుంటారు.
ఒకానొక సమయంలో భార్య దృష్టిలో కూడా తేలిక అవుతాడు. అవమానాలు.. అడ్డంకులు.. కష్టాలు అన్ని పడుతున్న నానిలో క్రికెట్ వైపు వెళ్లాలనే ఆలోచన వస్తుంది. దాంతో తిరిగి క్రికెట్ జట్టులో జాయిన్ కావాలనుకుంటాడు. పది సంవత్సరాల పాటు వదిలేసిన క్రికెట్ లో తిరిగి జాయిన్ కావడానికి ఎన్నో కష్టాలు పడతాడు. ముప్పదిఆరు సంవత్సరాల వయసులో క్రికెట్ జట్టులో జాయిన్ అయ్యి.. అతని లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. ఆ గెలుపులో ఇన్ని రోజులు పడ్డ కష్టాలు మరచి పోతాడు. ముఖ్యంగా నాని (కొడుకు) కళ్లలో ఆనందాన్ని చూసిన అర్జున్ ఆనందానికి అవధులు ఉండవు.. అంతేకాకుండా గెలుపుకు వయస్సు ఎప్పుడు అడ్డురాదని నిరూపిస్తాడు అర్జున్. అయితే అసలు అర్జున్ క్రికెట్ కి ఎందుకు దూరం అవుతాడు..? క్రికెట్ కి దూరం అయ్యాక అర్జున్ పరిస్థితి ఏంటి? క్రికెట్ జట్టులో తిరిగి ఎందుకు జాయిన్ అవుతాడు? అనేవి తెర మీదనే చూడాలి.
విశ్లేషణ :
దర్శకులు గౌతమ్ తిన్ననూరి విషయానికి వస్తే జెర్సీ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ని అద్భుతంగా చిత్రీకరించాడు గౌతమ్. నాని , శ్రద్దా శ్రీనాథ్ , రోహిత్ , సత్యరాజ్ ల నుండి అద్భుత నటన ని రాబట్టుకొని తనదైన ముద్ర వేసాడు. మళ్ళీ రావా చిత్రంతో పరిచయమైన గౌతమ్ జెర్సీతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మేకర్ గా మరోసారి తన అభిరుచి నిరూపించుకున్నాడు. అనిరుద్ అందించిన పాటలు బాగున్నాయి అంతకంటే నేపథ్య సంగీతం మరింత హైలెట్ గా నిలిచింది.
నటీనటులు :
న్యాచురల్ స్టార్ నాని తన బిరుదు కి న్యాయం చేసాడు. అర్జున్ పాత్రలో నాని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంత గొప్పగా నటించాడు. లవర్ గా క్రికెటర్ గా అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఎలా చూసుకున్నా అద్భుతంగా నటించి తన కెరీర్ లోనే జెర్సీ ని మైలురాయిగా నిలిపుకున్నాడు. కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ కూడా అద్భుతంగా నటించింది. మిగతా పాత్రలలో నటించిన వారు కూడా తమ పరిధి మేరకు నటించారు.
తెలుగు బులెట్ పంచ్ లైన్ : ఈ ఏడాదికి మరో హిట్ ఈ జెర్సీ.
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3.5 / 5