మళ్ళీ చై-శామ్ లు ఈసారి అజయ్ కధతో !

‘ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతితో న‌టుడు నాగ‌చైత‌న్య ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆర్ఎక్స్ 100 సక్సెస్ తరువాత అజయ్ భూపతితో సినిమాలు చేయడానికి యువ హీరోలు చాలామంది పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన రామ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సెట్ కాకపోగా అదే బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయాలనుకున్నారు. అక్కడా వర్కౌట్ కాకపోవడంతో నాగ చైతన్యకి లైన్ చెప్పి ఒప్పించాడట. చైతూకి లైన్ నచ్చడంతో పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకుందామని నాగచైతన్యకు చెప్పి ఆమెకి కూడా లైన్ చెప్పి ఒప్పించాడట అజయ్. ఆర్ఎక్స్ 100మూవీలో ముద్దులతో ముంచెత్తిన ఈదర్శకుడు ఈసినిమాలో ఏవిధంగా తీస్తాడో చూడాలి మరి.