‘జైలవకుశ’ ఉమర్‌సంధు రివ్యూ

Umar sandhu gives Jai Lava Kusa movie Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
స్టార్‌ హీరో సినిమా విడుదలవుతుంది అంటే సోషల్‌ మీడియాలో ఉమర్‌ సంధు సందడి చేస్తూ ఉంటాడు. ఆయన దుబాయిలో ఇండియన్‌ సినిమా మ్యాగజైన్‌ రిపోర్టర్‌. అలాగే దుబాయిలో సెన్సార్‌ బోర్డు స్క్రీనింగ్‌లో పాల్గొంటూ ఉంటాడు. అందుకే ప్రపంచం కంటే ముందు ఈయన సినిమా చూసి తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటాడు. కొన్ని సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అంటూ ఈయన రివ్యూ ఇచ్చిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. కొన్ని మాత్రం సక్సెస్‌ అయ్యాయి. అయితే ఏ సినిమా రిలీజ్‌ కాబోతున్నా ఈయన మాత్రం ట్విట్టర్‌ ద్వారా తన రివ్యూను ఇస్తూనే ఉంటాడు.

దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘జైలవకుశ’ చిత్రానికి దుబాయిలో స్క్రీనింగ్‌ జరిగింది. ఆ స్క్రీనింగ్‌లో పాల్గొన్న ఉమర్‌ సంధు సినిమాపై స్పందించాడు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌ సినిమాగా ఇది నిలుస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్‌కు మాత్రమే ఈ సినిమా సాధ్యం అని, మరెవ్వరైనా కూడా ఈ సినిమాను ఈ స్థాయిలో చేయలేకపోయేవారు అంటూ అభినందనలు గుప్పించాడు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు ఈ సినిమా వినోదాన్ని పంచుతుందనే అభిప్రాయాన్ని ఉమర్‌ సంధు ప్రకటించాడు. ఉమర్‌ రివ్యూతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ గాల్లో తేలిపోతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.